మృదువైన జవాబు

బైబిలు వక్రీకరణం చేయబడిందను  

పలు ముస్లీముల అపనిందకు

గత 1200 సంవత్సరాలకు పైగా పలువురు ముస్లీములు బైబిలు వక్రీకరణకు గురైందను అపనిందను ముస్లీమేతర్లపై మోపుతూవచ్చారు. పాశ్చాత్య పండితలోకం బైబిలును చాలా కాలంగా నిశిత విమర్శకు గురిచేస్తూ  వచ్చిన అంశాల్లో కొన్నింటిని తమ వాదనలకు వూతంగా మలుచుకొని బైబిలు కలగాపులగం చేయబడిందంటూ ముస్లీములు సాంప్రదాయికంగా చెబుతూవచ్చారు. అట్టి అపనింద నిరాధారమైనదని విడమర్చి చెప్పడమే ఈ మృదువైన జవాబు పుస్తకం యొక్క ముఖ్య వుద్దేశం. పొతే బైబిల్ను విమర్శించుటకు ఉపయోగించిన విధానాలు ఖురాన్ను సయితం విమర్శించుటకు ఇటీవలి కాలంవరకుగాని వుపయోగించబడలేదు. ముస్లీము వాదనలకు జవాబు చెప్తూ, శాస్త్రీయంగా ఖురాన్ను ఎంతగా విమర్శకు గురిచేయవచ్చో బైబిలును కూడా అదే దృక్పథంతో విమర్షించవచ్చంటుంది  మృదువైన జవాబు.

 

మృదువైన జవాబు, లేఖనాల సారాంశాన్ని గూర్చి సంభాషిద్దాము రమ్మని ముస్లీములకు ఆహ్వానం పలుకుతుంది. సంభాషణలోని భాగస్వామిని గౌరవించడమంటే సత్యాన్ని గూర్చిన విషయాన్ని తీవ్రంగా పరిగణన లోనికి తీసుకున్నట్లు లెక్క. దానర్ధము అపనిందల భావాన్ని గ్రహించటములో ఒకరు తన శాయశక్తుల ప్రయత్నించాలన్నమాట. అనగా నీ సంభాషణా భాగస్వామి యొక్క భావనా ప్రపంచంలో నీ విశ్వాసాన్ని విపులం చేయాలి. ముస్లీములు మరియు ముస్లీమేతర్ల మధ్యనున్న విభేదాలు అనతికాలములో సమసిపోయే సూచనేది లేదు. అయిననూ పెచ్చరిల్లుతున్న రాజకీయ వత్తిళ్లు మరియు హింసాయుత ప్రవృత్తులు నెలకొనివున్న అధునాతన యుగంలో ముస్లీములు మరియు ముస్లీమేతర్లు తమ తమ విశ్వాసాలను గూర్చి యధార్థంగా  చర్చించుకొను స్వాతంత్రాన్ని చేజారవిడుచుకోకుండా ఒండొరులపై గౌరవాన్ని పెంపొందించుకొంటూ శాంతియుత సహజీవనానికి కట్టుబడాలని ఆశ.

This site was designed with the
.com
website builder. Create your website today.
Start Now